V6 News

మలయాళ హిట్ 'వాజా 2' ఇప్పుడు తెలుగులో 'వాలా 2'గా.. సాహు గారపాటి క్రేజీ ప్రాజెక్ట్!

మలయాళ హిట్ 'వాజా 2' ఇప్పుడు తెలుగులో 'వాలా 2'గా.. సాహు గారపాటి క్రేజీ ప్రాజెక్ట్!

బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది మాలీవుడ్  మూవీ ' వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్'. కేవలం రూ 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ ఉహించని స్థాయిలో మేకర్స్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. ఏప్రిల్ 2న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కథ ఉంటే చాలు పెద్ద స్టార్స్ తో పనిలేదు అంటూ నిరూపిస్తుంది. కేవలం స్టోరీ బలంతోనే బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.

 'వాలా 2'గా తెలుగులో..

మలయాళంలో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ  ' వాజా 2' మూవీ ఇప్పుడు తెలుగులో ' వాలా 2 'పేరుతో విడుదలకు సిద్ధం అయింది. లేటెస్ట్ గా ఈ చిత్రం తెలుగు వెర్షన్  ట్రైలర్ ను నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేశారు.  ఏప్రిల్ 24న  ఏపీ, తెలంగాణలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సావిన్ ఎస్.ఏ తొలిసారి దర్శకత్వం వహించారు. తొలి ప్రయత్నంతో గ్రాండ్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. మరోవైపు టాలీవుడ్ నిర్మాత గారపాటి సాహు ఈ మూవీ నిర్మాణంగా భాగస్వాములుగా ఉన్నారు.  

కథా నేపథ్యం..

ఈ యూత్ ఫుల్ సినిమా.. చదువు అబ్బని నలుగురు కుర్రాళ్ళ స్నేహం చుట్టూ తిరుగుతుంది. పాఠశాల దశలో ‘వేస్ట్ బ్యాచ్’ అనిపించుకున్న  వీరు చివరకు ఏం తెలుసుకున్నారు. చదువు పూర్తయ్యాక ఉపాధి కోసం భారత్, దుబాయ్,, యూకే వంటి ప్రాంతాలకు వెళ్లి స్థిరపడటానికి పడే కష్టాలను ఈ కథలో సహజంగా చూపించారు దర్శకుడు.  ఈ మూవీలో అజిన్ జాయ్, వినాయక్, హాషిర్, సుధీష్, అల్ఫోన్స్ పుత్రెన్ కీలకపాత్రలో నటించారు. అంకిత్ మీనన్ సంగీతాన్ని అందించారు. 

ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు విపిన్ దాస్ స్క్రీప్ట్ అందించారు.   డబ్ల్యుబిటిఎస్ ప్రొడక్షన్స్, ఇమాజిన్ సినిమాస్, షైన్ స్క్రీన్స్, సిగ్నేచర్ స్టూడియోస్, ఐకాన్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.   మలయాళంలో రికార్డులు క్రియేట్ చేసిన ఈ కుర్రాళ్ల మూవీ .. తెలుగులో ఏలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి మరి.