V6 News

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు వీళ్లే..

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు వీళ్లే..

ఢిల్లీ: జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన.. వివాన్ శరద్ మహీశ్వరి (తెలంగాణ), నరేంద్ర బాబు గారి మహిత్ (ఆంధ్రప్రదేశ్) కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పది మంది 100 పర్సంటైల్ సాధించారు.

తెలంగాణకు చెందిన భవితేష్ రెడ్డి, మంథా శివకామేశ్, సాయి రుత్విక్ రెడ్డి, రిషి ప్రేమ్ నాథ్ 100 పర్సంటైల్ సాధించి సత్తా చాటారు. పరీక్షా ఫలితాల కోసం jeemain.nta.nic.in, nta.ac.inలలో చూసుకోవచ్చు. ఫలితాలతో పాటు, NTA జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్ల జాబితాను, కట్-ఆఫ్ పర్సంటైల్‌ను కూడా అందుబాటులో ఉంచింది. గత సంవత్సరం, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కట్-ఆఫ్ 100 నుంచి 93.1023262 వరకు ఉంది. జేఈఈ మెయిన్ కట్-ఆఫ్.. జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఈఎస్‌టీ, ఐఐఐటీలు, ఇతర జీఎఫ్‌టీఐల వంటి సంస్థలలో ప్రవేశానికి అర్హతను నిర్ణయిస్తుంది. 

అభ్యర్థులు తమ JEE మెయిన్ స్కోర్‌లు పర్సంటైల్ ర్యాంకింగ్‌లుగా ఎలా మారవచ్చో అర్థం చేసుకోవడానికి మార్కులు వర్సెస్ పర్సంటైల్ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, 300 నుంచి 291 మధ్య స్కోర్‌లు సాధారణంగా 100 నుంచి 99.99989 పర్సంటైల్ పరిధిలోకి వస్తాయి. 290 నుంచి 281 మధ్య మార్కులు సుమారుగా 99.99908 నుంచి 99.99745 పర్సంటైల్‌ పరిధిలో ఉంటాయి.

►ALSO READ | అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కొలువులు: మే 19న వాక్-ఇన్ ఇంటర్వ్యూ!

స్కోర్ పరిధి తగ్గే కొద్దీ.. పర్సంటైల్ కూడా క్రమంగా తగ్గుతుంది. అదే విధంగా.. 250 నుంచి 241 మధ్య స్కోర్ చేసే అభ్యర్థులు సుమారుగా 99.95028 నుంచి 99.94664 వరకు పర్సంటైల్ పరిధిలో ఉంటారు. 200–191 పరిధిలో ఉన్నవారు సుమారుగా 99.62402 నుంచి 99.71083 వరకు పర్సంటైల్‌ను పొందే అవకాశం ఉంది.