
ఐపీఎల్ 2023 సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచేజీ జట్టు కెప్టెన్ గా సౌతాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ ఐడెన్ మార్క్రమ్ ను నియమించింది. సౌతాఫ్రికా లీగ్ లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ కు కెప్టెన్ గా వ్యవహరించిన మార్క్రమ్.. జట్టును విజేతగా నిలిపాడు. దాంతో మార్క్రమ్ పై పూర్తి భరోసా ఉంచి ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ ని చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మార్క్రమ్.. సన్ రైజర్స్ టీం గురించి.. టీం సభ్యుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ప్రస్తుతం కెప్టెన్ గా నాపై పెద్ద బాధ్యత ఉంది. గత సీజన్ లో పేలవ ప్రదర్శన ప్లేయర్స్ తో పాటు అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురించేసింది. 2023 సీజన్లో మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆటగాళ్లపై ఎటువంటి ఒత్తిడి తీసుకురానివ్వను. వాళ్లను స్వేచ్ఛగా ఉంచేందుకు ప్రయత్నిస్తా. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని మార్చుతా. అందుకు ఫ్రాంచేజీ పూర్తి సహకారం అందిస్తుంద’ని మార్క్రమ్ అన్నాడు.