SRH vs DC : టాస్ గెలిచిన బ్యాటింగ్ తీసుకున్న ఢిల్లీ

SRH vs DC :  టాస్ గెలిచిన బ్యాటింగ్ తీసుకున్న ఢిల్లీ

ఉప్పల్ లో సన్ రైజర్స్ తో జరుగుతోన్న  మ్యాచ్ లో డిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానులతో ఉప్పల్ స్టేడియం నిండిపోయింది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 


అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, ఐడెన్ మార్క్రామ్ (సి), మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్), మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 


డేవిడ్ వార్నర్ (c), ఫిలిప్ సాల్ట్ (WK), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ

ఇరు జట్లకు మ్యాచ్ కీలకం

సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్  ఈ ఐపీఎల్ లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్  రెండు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 6 మ్యాచ్ లు ఆడి కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.  ఇక ముందు ఆడాల్సిన ప్రతీ మ్యాచ్ ఇరు జట్లకు  కీలకం కానున్నాయి.