హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమైంది. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న శోభాయాత్రను గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన గవర్నర్.. భారతీయ సంస్కృతిలో రామాయణం విశిష్టమైనదని చెప్పారు. రామాయణంలో ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భర్త, ఆదర్శ పురుషుడిగా నిలబడిన శ్రీరాముడిని స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. తరబడి నగరంలో శ్రీరామ శోభాయాత్ర కల్యాణోత్సవం విశేషంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక, సీతమ్మ తల్లి పవిత్రతకు ప్రతీక అని అన్నారు. శోభాయాత్ర భక్తి ఐకమత్యానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు గవర్నర్ .
సీతారాం బాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యయామశాల వరకు ఈ శోభాయాత్ర సాగనుంది. శోభాయాత్ర సందర్భంగా రాత్రి 9 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.సీతారాంబాగ్ నుండి కోటి హనుమాన్ హనుమాన్ వ్యయమశాల వరకు సాగే శోభాయాత్రకు 3000కు పైగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రధాన ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
సీతారాంబాగ్ ఆలయం: ఆసిఫ్ నగర్ నుంచి బోయిగూడ కమాన్ వైపు వచ్చే ట్రాఫిక్ ను మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వద్ద విజయ్ నగర్ కాలనీ, నాంపల్లి , మెహదీపట్నం వైపు మళ్లిస్తారు
ఫ్రెండ్స్ కేఫ్: అఘాపురా , బోయిగూడ కమాన్ బై-లేన్ల నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే వాహనాలను బోయిగూడ కమాన్ వద్ద అఘాపురా , హబీబ్ నగర్ వైపు డైవర్ట్ చేస్తారు.
బోయిగూడ కమాన్: దారుస్సలాం నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే వాహనాలను అఘాపురా ఎక్స్ రోడ్స్ వద్ద ఘోడే- కీ -ఖబర్ లేదా కొత్త అఘాపురా, చార్ కందిల్ ఎక్స్ రోడ్, నాంపల్లి వైపు మళ్లిస్తారు.
బోయిగూడ కమాన్ కుడి మలుపు: శోభాయాత్ర బోయిగూడ కమాన్ వద్ద మంగళ్‌హాట్ మార్కెట్ వైపు కుడి మలుపు తీసుకున్నప్పుడు, గాంధీ విగ్రహం నుంచి మంగళ్ హాట్ వైపు వచ్చే ట్రాఫిక్ ఘోడే -కీ -ఖబర్ వద్ద టక్కర్‌వాడీ జంక్షన్ లేదా కొత్త అఘాపురా వైపు డైవర్ట్చేస్తారు.
జాలీ హనుమాన్ ఆలయం: పురాణాపూల్ , జుమ్మేరాత్బజార్నుంచి మంగళ్‌హాట్ వైపు వచ్చే వాహనాలను గాంధీ విగ్రహం వద్ద టక్కర్‌వాడీ జంక్షన్ లేదా ఘోడే- కీ-ఖబర్/పురానాపూల్ వైపు పంపిస్తారు.
రహీంపురా: పురాణాపూల్ నుంచి గాంధీ విగ్రహం వైపు వచ్చే వెహికల్స్‌ను పురాణాపూల్ ఎక్స్ రోడ్స్ వద్ద పురాణాపూల్ దర్వాజా, కార్వాన్, కుల్సుంపురా, 100 ఫీట్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
గాంధీ విగ్రహం: ఎంజే బ్రిడ్జి నుంచి టక్కర్‌వాడీ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను ఆఘాపురా , ఘోడే -కీ -ఖబర్ వైపు మళ్లిస్తారు. ఎంజే బ్రిడ్జి నుంచి అఫ్జల్‌గంజ్/సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలు జుమ్మేరాత్బజార్రోడ్డు మీదుగా తరలిస్తారు.
టక్కర్‌వాడీ జంక్షన్: బేగంబజార్ ఛత్రీ నుంచి వచ్చే ట్రాఫిక్ రాణి అవంతీ బాయి విగ్రహం వద్ద ఎంజే బ్రిడ్జ్ వైపు పంపిస్తారు.
రాణి అవంతీ బాయి విగ్రహం (జుమ్మేరాత్‌బజార్): బేగంబజార్ బై-లేన్ల నుంచి గాంధీ విగ్రహం/పురాణాపూల్ వైపు వచ్చే ట్రాఫిక్ ను లేబర్ అడ్డా వద్ద అలాస్కా టీ -జంక్షన్ వైపు డైవర్ట్చేస్తారు.
బేగంబజార్ ఛత్రీ: మాలకుంట నుంచి ఎంజే బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలను అలాస్కా టీ -జంక్షన్ వద్ద దారుస్సలాం/మాలకుంట వైపు మళ్లిస్తారు. రంగచారి లేన్, అఫ్జల్‌గంజ్ నుంచి బేగంబజార్ వైపు వచ్చే ట్రాఫిక్ ను ఎస్ఏ బజార్ (శ్రీకృష్ణ జ్యువెల్లరీ వద్ద) నుంచి ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.
బర్తన్ బజార్: అఫ్జల్‌గంజ్ బై-లేన్ల నుంచి ఎస్ఏ బజార్ వైపు వచ్చే ట్రాఫిక్ ను ఎస్ఏ బజార్ యూ టర్న్వద్ద అఫ్జల్‌గంజ్ సాలార్‌జంగ్ బ్రిడ్జ్ వైపు మళ్లిస్తారు.
ఎస్ఏ బజార్: అజంతా గేట్ , జాంబాగ్‌ల నుంచి ఎస్ఏ బజార్ వైపు వచ్చే వాహనాలను ఎంజే మార్కెట్ వద్ద పుత్లీబౌలి, రంగమహల్ వైపు టర్న్చేస్తారు.
ఎస్ఏ బజార్ మసీదు: నయాపూల్ నుంచి ఎస్ఏ బజార్ మసీదు వైపు వచ్చే వెహికల్స్‌ను అఫ్జల్‌గంజ్ టీ -జంక్షన్ వద్ద సెంట్రల్ లైబ్రరీ – శివాజీ బ్రిడ్జ్ – సీబీఎస్వైపు మళ్లిస్తారు.
ఎంజే మార్కెట్: నాంపల్లి , అబిడ్స్ నుంచి ఎస్ఏ బజార్ మసీదు వైపు వెళ్లే వాహనాలను ఎంజే మార్కెట్ వద్ద జాంబాగ్, పుట్లిబౌలి , రంగమహల్ వైపు డైవర్ట్చేస్తారు.
అబిడ్స్ జీపీవో : అబిడ్స్ రోడ్డు నుంచి ఎంజే మార్కెట్ వైపు వచ్చే వాహనాలను బ్యాంక్ స్ట్రీట్, ఆంధ్రా బ్యాంక్ రోడ్డు వైపు మళ్లిస్తారు. (యాత్ర శంకర్ షేర్ హోటల్ చేరుకోగానే ఈ మళ్లింపు ఉంటుంది)
ఎస్ఏ బజార్/గౌలిగూడ చమన్: పుట్లిబౌలి నుంచి శంకర్ షేర్ హోటల్ వైపు వచ్చే ట్రాఫిక్ గౌలిగూడ చమన్ వద్ద త్రివేణి లాడ్జ్ , సీబీఎస్వైపు మళ్లిస్తారు.
శంకర్ షేర్ హోటల్: రంగమహల్ నుంచి గౌలిగూడ చమన్ వైపు వచ్చే ట్రాఫిక్ పుట్లిబౌలి ఎక్స్ రోడ్స్ వద్ద జాంబాగ్ , ఎంజే మార్కెట్ వైపు డైవర్ట్చేస్తారు. ఆంధ్ర బ్యాంక్ నుంచి వచ్చే వాహనాలను కూడా ఇదే విధంగా మళ్లిస్తారు.
రామ్ మందిర్ కమాన్: చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్‌నుంచి పుట్లిబౌలి/జాంబాగ్ వైపు వచ్చే వెహికల్స్రంగమహల్ వై జంక్షన్ వద్ద సీబీఎస్ , అఫ్జల్‌గంజ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
రామ్ మందిర్ కమాన్ (అబిడ్స్ నుంచి): జీపీవో అబిడ్స్నుంచి పుట్లిబౌలి ఎక్స్ రోడ్ వైపు వచ్చే వాహనాలు ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ వద్ద డీఎంహెచ్ఎస్ఎక్స్ రోడ్ వైపు వెళ్లాలి. అబిడ్స్ రోడ్డు నుంచి బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే వాహనాలను జీపీవో వద్ద ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.
పుత్లీబౌలి ఎక్స్ రోడ్: ఎంజే మార్కెట్ నుంచి ట్రూప్ బజార్/బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే వా హనాలు యూసుఫ్ అండ్ కంపెనీ వద్ద జీపీవో, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.
పుత్లీబౌలి ఎక్స్ రోడ్ (చాదర్‌ఘాట్ నుంచి): చాదర్‌ఘాట్ నుంచి ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ డీఎంహెచ్ఎస్ఎక్స్ రోడ్ వద్ద సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. సుల్తాన్ బజార్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను చాదర్‌ఘాట్ వైపు డైవర్ట్ చేస్తారు.
ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్: చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్ నుంచి డీఎంహెచ్ఎస్ఎక్స్ రోడ్ వైపు వచ్చే వాహనాలు చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్స్ వద్ద నింబోలిఅడ్డ – కాచిగూడ ఎక్స్ రోడ్ వైపు వెళ్లాలి.
ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ (నారాయణగూడ నుంచి): నారాయణగూడ నుంచి బడీచౌడి వైపు వచ్చే వాహనాలు కాచిగూడ ఎక్స్ రోడ్ వద్ద కాచిగూడ స్టేషన్ రోడ్డు వైపు మళ్లాలి. అబిడ్స్ నుంచి ఆంధ్ర బ్యాంక్ వైపు వచ్చే ట్రాఫిక్ జీపీవో వద్ద ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.
సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్ : బాటా రోడ్ – కింగ్ కోఠి – రాంకోఠి ఎక్స్ రోడ్ నుంచి ప్రగతి టిఫిన్ సెంటర్ వైపు వచ్చే ట్రాఫిక్ ను బొగ్గులకుంట ఎక్స్ రోడ్ వద్ద మళ్లిస్తారు.
రద్దీగా ఉండే ప్రాంతాలివే..
బేగంబజార్ ఛత్రీ, ఎస్ఏ బజార్, అఫ్జల్‌గంజ్ టీ -జంక్షన్, శివాజీ బ్రిడ్జి, సీబీఎస్, రంగమహల్ వై -జంక్షన్, పుట్లిబౌలి ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్, అబిడ్స్ జీపీవో, ఎంజే మార్కెట్, చాదర్‌ఘాట్, కాచిగూడ ఎక్స్ రోడ్, నింబోలిఅడ్డ.
