Ind vs Aus: ఆసీస్తో టెస్టు సిరీస్లో తెలుగబ్బాయికి ఛాన్స్!

Ind vs Aus: ఆసీస్తో టెస్టు సిరీస్లో తెలుగబ్బాయికి ఛాన్స్!

నాగ్ పూర్ వేదికగా ఫిబ్రవరి 9నుంచి ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. జట్టును గాయాలు వెంటాడుతుండటంతో ప్లేయింగ్ లెవన్ లో ఎవరిని ఆడించాలన్నది మేనేజ్మెంట్ కు కష్టంగా మారింది. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ తలపట్టుకొని కూర్చున్నారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో ఎవరిని ఆడించాలన్నదానిపై సెలక్షన్ టీంలో ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అయితే, టీంకు శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్ రూపంలో రెండు ఆప్షన్స్ ఉన్నా.. మేనేజ్మెంట్ మాత్రం శ్రీకర్ భరత్ వైపు మొగ్గు చూపిస్తోంది.

భరత్ కు దేశవాళిలో ఆడిన అనుభవం ఉంది. గత మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. 2021లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో సబ్ స్టిట్యూట్ గా వచ్చి తన వికెట్ కీపింగ్ స్కిల్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే, ఇషాన్ కు టెస్టుల్లో ఆడిన అనుభవం అంతగా లేదు. ఈ నేపథ్యంలో శ్రీకర్ భరత్ కు ప్లేయింగ్ లెవన్ లో ఛాన్స్ లు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి.