కార్తీక మాసం : శ్రీశైలంలో ఆలయ వేళలు మార్పు

కార్తీక మాసం : శ్రీశైలంలో ఆలయ వేళలు మార్పు

కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలో ఆలయ వేళలు మార్పు చేసినట్లు తెలిపారు దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు. శని, ఆది, సోమ, శుద్ధ ఏకాదశి, రెండో శనివారాలు రద్దీ రోజులుగా గుర్తించామని తెలిపారు. రద్దీ రోజుల్లో తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరుస్తామని.. మంగళవాయిద్యాలు, సుప్రభాత సేవ, మంగళహారతి అనంతరం 4 గంటలనుండి భక్తులకు దర్శనం ఉంటుందన్నారు. రద్దీ రోజుల్లో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు  ఈవో రామారావు. భక్తుల రద్దీ దృష్ట్యా రెండు విడుతలుగా ఆర్జిత చండీ హోమాలు, రుద్ర హోమాలు తొలివిడుత ఉదయం 7.30 గంటలకు, రెండో విడుత ఉదయం 10 గంటలకు హోమాలు. క్యూలైన్లలో భక్తులకు అల్పాహారం, బిస్కెట్లు, తాగునీరు, రద్దీ రోజుల్లో పాలు ఇస్తామన్నారు.

పాతాళగంగ మార్గంలోని శివదీక్షా శిబిరాల ఉద్యానవనంలో ప్రతిరోజు కార్తీక వనభోజనాలు ఉంటాయని.. ఉదయం 11 గంటల నుండి దేవస్థానం ఆధ్వర్యంలో వన భోజనాలు ఉంటాయన్నారు. కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు ఆకాశదీపం వెలిగింపు ఉంటుందని.. కార్తీక దీపారాధన చేసుకునే భక్తులకు ఆలయ ఉత్తర భాగం నుండి ప్రత్యేక ప్రవేశం ఉంటుందన్నారు.