హైదరాబాద్, వెలుగు: టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి మంగళవారం తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయని చెప్పారు.
ఈ పరీక్షలకు అటెండ్ కావాలనుకునే విద్యార్థులు ఈ నెల 30 నుంచి మే 14 వరకు హెడ్మాస్టర్లకు ఫీజు చెల్లించాలని సూచించారు. లేట్ ఫీజు రూ.50తో సబ్జెక్టు ఎగ్జామ్ కు రెండు రోజుల ముందు వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందని వెల్లడించారు.
టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ టైమ్ టేబుల్ -
తేదీ సబ్జెక్టు
05.06.2026 ప్రథమ భాష
06.06.2026 ద్వితీయ భాష
07.06.2026 ఇంగ్లిష్
08.06.2026 మ్యాథ్స్
09.06.2026 ఫిజికల్ సైన్స్
10.06.2026 బయోలాజికల్ సైన్స్
11.06.2026 సోషల్ స్టడీస్
12.06.2026 ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2

