న్యూఢిల్లీ: బ్రిటన్కు చెందిన స్టాండర్డ్ చార్టర్డ్ (స్టాన్‌చార్ట్) రాబోయే నాలుగేళ్లలో ఏడు వేలకు పైగా కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి ఎగ్జిక్యూటివ్స్ సంఖ్యను 15 శాతం తగ్గించనుంది.
ఉత్పాదకతను పెంచడం, వృద్ధిని కొనసాగించడం, సాంకేతికతను మెరుగుపరచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. పనులను మరింత సమర్థంగా చేయడానికి ఆటోమేషన్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్, ఏఐని వాడుతున్నామని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ విభాగాల్లో పనిచేస్తున్న 52 వేల మందిపై ఈ ప్రభావం పడనుంది. ఈ బ్యాంకుకు ప్రపంచవ్యాప్తంగా 82 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. భారతదేశంలోనూ సిబ్బంది తగ్గింపు ఉంటుందని స్టాన్‌చార్ట్ వర్గాలు తెలిపాయి.
