స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ కేటగిరీలో బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ (బీఎంఓ–-II) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 24 నుంచి ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి 2026, జులై 14 వరకు అవకాశం ఉంది.
పోస్టు పేరు: బ్యాంక్ మెడికల్ ఆఫీసర్.
మొత్తం పోస్టులు: 35. హైదరాబాద్ (2).
ఎలిజిబిలిటీ: నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తిచేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. కనీసం మూడు నుంచి ఐదేళ్ల అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు ఎలాంటి ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జులై 14.
ఆన్‌లైన్ రాత పరీక్ష: ఆగస్టు.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషియెన్సీ టెస్ట్ (ఎల్ఎల్పీటీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 70 శాతం, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ sbi.bank.inను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. రీజనింగ్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 20 ప్రశ్నలు 20 మార్కులకు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
