
ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంపై బీజేపీ పోరుబాట పట్టింది. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కేసీఆర్ సర్కార్ ఆగం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. ఏమాత్రం ఆలోచించకుండా.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని.. గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని ఆయన అన్నారు. ప్లాన్ బి లేకుండానే… గ్లోబరీనా సంస్థ… పరీక్ష నిర్వహణ చేసిందన్నారు. 23 మంది పిల్లలు ఆత్మహత్యలకు.. ఈ ప్రభుత్వానిదే బాధ్యతన్నారు.
పరీక్షల మీద ఫిబ్రవరి నుంచి విద్యాశాఖ మంత్రి కనీసం ఒక్క రివ్యూ కూడా చేయలేదని.. జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేసేవరకు బీజేపీ పోరాటం, ఉద్యమం చేస్తుందన్నారు లక్ష్మణ్. పాస్ అయిన విద్యార్థులు కూడా పోటీ పరీక్షలకు దూరం అయ్యే పరిస్థితి వచ్చిందని… ఇంటర్ వెయిటేజీ మార్కులు కోల్పోతున్నారని అన్నారు. ఎంసెట్ ను 3 సార్లు నిర్వహించే దుస్థితి గతంలో చూశామన్నారు. Tspsc నిర్వహణ కోర్టుల చుట్టూ తిరుగుతోందన్నారు. ఇంటర్ బోర్డ్ రద్దు అనేది తుగ్లక్ చర్య అన్నారు. వ్యవహారంపై సిట్టింగ్ జడ్జ్ తో న్యాయ విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు.
బీజేపీ కార్యాచరణ
ఏప్రిల్ 28న అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్కరోజు నిరసన దీక్ష
29 న హైదరాబాద్ లో స్టూడెంట్స్, పేరెంట్స్, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం
30 న ప్రగతి భవన్ ను ముట్టడి
డిమాండ్లు పరిష్కారం కాకపోతే…
మే 2 న రాష్ట్ర బంద్ కు పిలుపు