ఎంపీ అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌లో అసహనం పెరిగింది : రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి

ఎంపీ అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌లో అసహనం పెరిగింది : రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి

హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ మేయర్ పదవి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు దక్కడంతో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌లో అసహనం పెరిగిందని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి ఫైర్ అయ్యారు.దీంతొ ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రభుత్వంపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అర్వింద్ ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తాను ఆయనకు అసహనం లేకుండా చేసే ట్యాబెట్లను పంపుతున్నానని చెప్పారు. ఎంపీ అర్వింద్.. తన అసహనాన్ని పూర్తిగా తొలగించేందుకు, ఆయన కడుపులో ఉన్న మంటను తగ్గించేందుకు మూడు పూటలా ఈ గోళీలు వేసుకోవాలని సూచించారు.