టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రాష్ట్ర సర్కార్ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రాష్ట్ర సర్కార్ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఒకటి, రెండ్రోజుల్లో షెడ్యూల్ ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు చర్యలు 
  • ఏడేండ్ల తర్వాత ప్రమోషన్లు, నాలుగేండ్ల తర్వాత బదిలీలు 
  • పది వేల పీఎస్ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం పోస్టులు, పండిట్, పీఈటీల ప్రమోషన్ల అంశం పక్కకు 

హైదరాబాద్, వెలుగు: టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రాష్ట్ర సర్కార్ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఒకటి, రెండ్రోజుల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో 9,700 మందికి పైగా టీచర్లకు ప్రమోషన్లు రానుండగా, మరో 40 వేల మందికి బదిలీలు జరిగే అవకాశముంది. అయితే, పీఎస్ హెచ్‌ఎం పోస్టులను 10 వేలకు పెంచుతామన్న హామీతో పాటు పండిట్, పీఈటీ అప్‌గ్రేడ్ పోస్టుల్లో ప్రమోషన్ల అంశాలను ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది. రాష్ట్రంలో 26 వేలకు పైగా సర్కారు స్కూళ్లుండగా, వాటిలో 1.05 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. రెండేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లు బదిలీలకు, ప్రమోషన్లకు అర్హులు. రెండేండ్లకోసారి ఈ ప్రక్రియ నిర్వహించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2015లో బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టారు. వివిధ కారణాలు చెప్పి 2018లో బదిలీలు మాత్రమే నిర్వహించారు. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఎన్నికలొచ్చినా త్వరలో అంటూ సర్కారు పెద్దలు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల కోసం సంఘాలు అనేక పోరాటాలు చేసినా సర్కారు స్పందించలేదు. తాజాగా మార్చిలో మహబూబ్‌నగర్– రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ఉండటంతోనే బదిలీలు, ప్రమోషన్లు పక్రియ ముందుకు పడిందని టీచర్లు అంటున్నారు. 

పండగపూట టీచర్ల జేఏసీలతో మంత్రుల భేటీ..

ఆదివారం సంక్రాంతి పండుగ రోజున టీటీజేఏసీ, యూఎస్‌పీసీ, జాక్టో తదితర టీచర్ల జేఏసీలతో మంత్రులు హారీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి వేర్వేరుగా సమావేశమయ్యారు. టీచర్లకు సంక్రాంతి కానుకగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపడతామని, రెండుమూడ్రోజుల్లో గైడ్​ లైన్స్ రిలీజ్ చేస్తామని వారు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మోడల్ స్కూళ్లు, కేజీబీవీ టీచర్లకు బదిలీలు చేపడతామని వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా వెబ్ కౌన్సెలింగ్ పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, టీచర్ల జేఏసీ చైర్మన్లు పింగిలి శ్రీపాల్ రెడ్డి, చావ రవి, సదానందంగౌడ్ తదితరులు ఉన్నారు. 

ఎస్జీటీ 7,693, ఎస్‌ఏ 2,013.. 

ప్రమోషన్లతో సుమారు 10 వేల మంది టీచర్లకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ) 7,693 మంది ఉండగా, 2,013 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉన్నట్టు తెలుస్తున్నది. స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్ ప్రమోషన్ ఇవ్వడంతో, మిగిలే 2 వేల పోస్టుల్లో 70శాతం పోస్టులను మళ్లీ ఎస్జీటీలకు ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన 30 శాతం పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నింపుతారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఎంఈవోతో పాటు పండిట్, పీఈటీ పోస్టులను భర్తీ చేయడంలేదని సర్కారు చెబుతున్నది. మరోవైపు సాధారణ బదిలీల్లో ఈసారి 40 వేల మంది వరకు ట్రాన్స్‌ఫర్‌‌ అయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు బదిలీ అయినా, ప్రమోషన్ పొందినా ప్రస్తుతం పనిచేస్తున్న బడుల్లోనే పనిచేయాలని, లాస్ట్ వర్కింగ్ డే రోజున కొత్త స్కూళ్లలో జాయిన్ కావాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. 

ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్ఎం పోస్టుల పెంపు లేనట్టే! 

ప్రైమరీ స్కూళ్లలో ఫీమెయిల్ లిట్రసీ(ఎల్‌ఎఫ్‌ఎల్) హెడ్మాస్టర్ పోస్టుల పెంపుపై సీఎం కేసీఆర్ హామీ అమలుకు నోచుకోవడంలేదు. ఆ పోస్టులను 10 వేలకు పెంచుతామని గతంలో ప్రకటించారు. ప్రస్తుతం 4,207 ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులుండగా, మరో 5,793 పోస్టులకు కొత్తగా మంజూరు చేస్తారని అంతా భావించినా.. వాటి జోలికి వెళ్లడంలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మంజూరైన, వాటిలో ఖాళీగా ఉన్న 2,130 ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులను మాత్రమే ఎస్జీటీలతో భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పండిట్, పీఈటీ పోస్టుల ప్రమోషన్లు లేనట్టేనని తెలుస్తున్నది. 2021లోనే 8,630 పండిట్ పోస్టులను, 1,849 పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేశారు. కానీ, కోర్టు కేసుల పేరుతో వారికి ప్రమోషన్లు ఇవ్వలేదు. 

ముందు హెడ్మాస్టర్లకు.. 

బదిలీలు, ప్రమోషన్లకు ఒకేసారి షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం పనిచేస్తున్న హెడ్మాస్టర్లకు  ముందుగా బదిలీలు నిర్వహిస్తారు. తర్వాత మిగిలిన ఖాళీల్లో స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంగా ప్రమోషన్లు ఇస్తారు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు నిర్వహించి, ఖాళీ స్థానాల్లో సబ్జెక్టుల వారిగా ఎస్జీటీలకు ప్రమోషన్లు కల్పిస్తారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌ పోస్టులనూ ఎస్జీటీలతో భర్తీ చేస్తారు. ఆ తర్వాత ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ అంతా నెల రోజుల్లోనే పూర్తయ్యేలా షెడ్యూల్ రెడీ చేస్తున్నారు.

జీవో 317తో బదిలీ అయిన వారికి నో చాన్స్..

జీవో 317తో ఎఫెక్ట్ అయిన టీచర్లకు బదిలీల్లో అవకాశం కల్పించలేదు. సాధారణంగా రెండేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారే అర్హులు కాబట్టి, వీరంతా బదిలీల పరిధిలోకి రాబోరని అధికారులు చెబుతున్నారు. 317 జీవోతో సుమారు 22,572 మంది టీచర్లు, స్పౌజ్ కేటగిరీలో 1,300, కోర్టు అప్పీల్స్, ఇతర బదిలీలతో సుమారు 25 వేల మందిపై ప్రభావం పడింది. అయితే, జీవో 317 ద్వారా బదిలీల సందర్భంగా అన్ని ఖాళీలు చూపించలేదని, కాబట్టి తమకూ అవకాశం కల్పించాలని కొందరు 317 బాధిత టీచర్ల కోరుతున్నారు.