లిక్కర్ అమ్మకాల్లో రికార్డ్ : ఇవాళ రూ.180 కోట్ల మద్యం సేల్

లిక్కర్ అమ్మకాల్లో రికార్డ్ : ఇవాళ రూ.180 కోట్ల మద్యం సేల్

హైదరాబాద్ : లిక్కర్ అమ్మకాల్లో రికార్డ్ సృష్టించింది రాష్ట్ర ఎక్సైజ్ శాఖ. ఇవ్వాళ ఒక్క రోజే రూ.180 కోట్ల విలువైన మద్యాన్ని అమ్మింది. డిపోల నుంచి వైన్స్, బార్లకు మద్యం భారీగా చేరిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్దమొత్తంలో మద్యాన్ని ఇంతవరకు అమ్మలేదని… ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ చెప్పింది. ఇది ఒక రికార్డ్ అని వివరించారు అధికారులు.

స్టేట్ జీఎస్టీ లోనూ ఈ నెలలో ఇది ఓ రికార్డ్ అని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు. స్టేట్ GST కి సంబంధించి ఈ నెలలో రూ.1024 కోట్ల ఆదాయం రాష్ట్రానికి వచ్చిందన్నారు. ఒక్క నెలలో ఇంత ఆదాయం ఎప్పుడు రాలేదని GST అధికారులు చెప్పారు.