సిటీ యూనియన్ బ్యాంక్  లాభం రూ. 254 కోట్లు

సిటీ యూనియన్ బ్యాంక్  లాభం రూ. 254 కోట్లు

చెన్నై: ప్రైవేట్ రంగ సిటీ యూనియన్ బ్యాంకుకు మార్చి క్వార్టర్లో నికర లాభాలు 17 శాతం పెరిగి రూ. 254.81 కోట్లకు చేరుకున్నాయి. స్లిప్పేజీల నుంచి మెరుగైన రికవరీ కారణంగా లాభాలు పెరిగాయి. తమిళనాడుకు చెందిన ఈ బ్యాంక్ గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.218.04 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, బ్యాంక్ నికర లాభాలు రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించాయి.

ఏడాది క్రితం నమోదైన రూ. 937.47 కోట్లతో పోలిస్తే ఇవి 8 శాతం పెరిగాయి. తాజా క్వార్టర్లో మొత్తం ఆదాయం గత ఏడాది ఇదే క్వార్టర్లో నమోదైన రూ.1,423.09 కోట్ల నుంచి రూ.1,549.34 కోట్లకు పెరిగింది. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, మొత్తం ఆదాయం ఏడాది క్రితం నమోదైన రూ.5,524.69 కోట్ల నుంచి రూ.6,012.22 కోట్లకు పెరిగింది. బ్యాంక్ మొదటి సారిగా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,02,138 కోట్ల లాభం మార్కుకు చేరుకుంది.