V6 News

మిల్లర్లతో సివిల్ సప్లయ్స్  చర్చలు సఫలం

మిల్లర్లతో సివిల్ సప్లయ్స్  చర్చలు సఫలం
  • సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ హామీ​

హైదరాబాద్, వెలుగు: మిల్లర్లతో సివిల్​సప్లయ్స్ కమిషనర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ధాన్యం కొనుగోళ్లపై నెలకొన్న అనిశ్చితి, అడ్డంకులు తొలగినట్లయింది. మంగళవారం ఎర్రమంజిల్​లోని సివిల్ సప్లయ్స్​ భవన్​లో మిల్లింగ్ అసోసియేషన్ల ప్రతినిధులతో సివిల్ సప్లయ్స్ శాఖ కమిషనర్​ స్టీఫెన్ రవీంద్ర చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మిల్లర్ల సమస్యలను కమిషనర్ దృష్టికి ప్రతినిధులు తీసుకెళ్లారు.

మిల్లింగ్​ఇండస్ట్రీకి ఇబ్బందులు కలుగకుండా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. బాయిల్డ్​ రైస్ వివాదంపై కేంద్రంతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 16న స్టేట్ అసోసియేషన్​ఆధ్వర్యంలో సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అసోసియేషన్​ ప్రతినిధులు వివరించారు.