స్ట్రీమ్ ఎంగేజ్ : కోడి పుంజు బొమ్మ కోసం...

స్ట్రీమ్ ఎంగేజ్ :  కోడి పుంజు బొమ్మ కోసం...

కోడి పుంజు బొమ్మ కోసం...

టైటిల్ : భామా కలాపం - 2
డైరెక్షన్​ : అభిమన్యు తాడిమేటి
కాస్ట్ : ప్రియమణి, సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, బ్రహ్మాజి, శరణ్య ప్రదీప్ 
లాంగ్వేజ్ : తెలుగు
ప్లాట్​ ఫాం : ఆహా


ఈ సిరీస్​ పార్ట్​ –1లో అనుపమ (ప్రియమణి) కుటుంబం ఆపద నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత వేరే ఇంటికి షిఫ్ట్​ అవ్వడంతో రెండో భాగం మొదలవుతుంది. ‘‘ఇతరుల విషయాలను పట్టించుకోను’’ అని భర్తకు మాట ఇచ్చిన అనుపమ యూట్యూబ్​ ద్వారా వచ్చిన డబ్బుతో ఒక హోటల్ పెడుతుంది. పనిమనిషి శిల్ప (శరణ్య)ను హోటల్​ బిజినెస్​లో పార్ట్​నర్​గా​ చేసుకుంటుంది. ‘హమ్మయ్య అంతా సజావుగా సాగిపోతుంది’ అనుకునేలోపు మరో సమస్యలో చిక్కుకుంటుంది అనుపమ. దాన్ని సాల్వ్ చేసే పనిలో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ ఆఫీసర్​ని కలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అనుపమకు వెయ్యి కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగతనం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ఏసీపీ కేస్ సాల్వ్ చేశాడా?

టైటిల్ : అబ్రహాం ఓజ్లర్
డైరెక్షన్​ : మిథున్ మాన్యుల్ థామస్
కాస్ట్ : జయరాం, మమ్ముట్టి, జగదీశ్, సెంథిల్ క్రిష్ణ, అనస్వర రాజన్, అర్జున్ అశోకన్, సైజూ కురుప్​
లాంగ్వేజ్ : తమిళం
ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్ హాట్​స్టార్


ఏసీపీ అబ్రహాం ఓజ్లర్​ (జయరాం) తన భార్య బిడ్డలకు దూరమై బాధలో ఉంటాడు. ఆ బాధలో ఉన్న అతనికి మిస్టరీ మర్డర్​ల కేస్​ ఒకటి సాల్వ్ చేసే పని అప్పజెప్తారు. ఆ కేస్​ని ఎలాగైనా సాల్వ్ చేయాలనుకుంటాడు ఓజ్లర్. సరిగ్గా అదే టైంలో ఒకచోట క్రైమ్​ జరిగిందని ఒక ఫోన్​ కాల్ వస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఏం ఉండదు. తర్వాత ఇంటికొచ్చి చూస్తే తన భార్య, కూతురు కిడ్నాప్​ అవుతారు. కొన్ని రోజుల తర్వాత ఒక బర్త్​ డే సెలబ్రేషన్​కి వచ్చిన కొంతమంది మిస్​ అవుతుంటారు. వాళ్లెందుకు మిస్ అవుతున్నారు? ఆ కేస్​ని ఏసీపీ ఎలా సాల్వ్ చేశాడు? అనేది మిగతా కథ. ఇది ఇన్వెస్టిగేటివ్​ థ్రిల్లర్. స్క్రీన్​ ప్లే, సినిమాటోగ్రఫీ, బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఫ్లాష్​బ్యాక్​లో మమ్ముట్టి సర్​ప్రైజ్ చేస్తాడు.   

గెలుపు ఎవరిది?

టైటిల్ : రాయ్ సింఘానీ వర్సెస్ రాయ్​ సింఘానీ
డైరెక్షన్​ : అనిరుద్ధ రాజ్​దే​కర్, భావ్నా శ్రేస్త్​
కాస్ట్ : జెన్నిఫర్ వింజెట్​, కరణ్ వాహి, రీమ్​ షేక్, సంజయ్​ నాథ్, కియారా సాధ్​
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్​ ఫాం : సోనీ లివ్


లాయర్ల​ చుట్టూ తిరిగే కోర్టు రూమ్​ డ్రామా. తండ్రి నడిపించే లా ఫర్మ్​లో కూతురు అనుష్క (జెన్నిఫర్) లాయర్​గా పనిచేస్తుంటుంది. చాలా చురుగ్గా ఉండే ఆమె నైతిక విలువలు పాటిస్తూ కమిట్​మెంట్​తో పనిచేస్తుంది. తన తండ్రి పేరు ప్రతిష్టలను కాపాడుతూ వస్తుంది. అయితే ఆమెకు నెపో కిడ్ అనిపించుకోవడం ఇష్టం ఉండదు. అందుకని సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఉంటుంది. ఆ జర్నీలో వ్యక్తిగతంగా, వృత్తిగతంగా వచ్చే ఇబ్బందుల్ని ఎదుర్కొనే తీరు ప్రేక్షకుల్ని ఇంప్రెస్​ చేస్తుంది. అదే లా ఫర్మ్​లో పనిచేసే లాయర్ విరాట్​ (కరణ్ వాహి) కూడా ఆమెలాగే ఇంటెలిజెంట్​. వీళ్లిద్దరి మధ్య సంభాషణలు ఇంట్రెస్టింగ్​గా ఉంటాయి. వీళ్లిద్దరితో పాటు అంకిత (రీమ్) అనే ఒక యువ లాయర్ ఆ సంస్థలో ఇంటర్న్​గా చేరుతుంది. ఆమె వచ్చాక కథలో ఇంట్రెస్ట్​ మొదలవుతుంది. పైగా వీళ్ల ముగ్గురి ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయి. ఈ వెబ్​సిరీస్​లో లీగల్​ డ్రామా బాగా వర్కవుట్ అయింది. ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్​గా ఉంటుంది. జెన్నిఫర్, కరణ్​ వాహిల నటన బాగుంది.