మెహిదీపట్నం, వెలుగు: వీధి కుక్క దాడిలో చిన్నారి గాయపడ్డ ఘటన లంగర్‌హౌస్ పరిధిలో జరిగింది. శుక్రవారం సాయంత్రం లక్ష్మీనగర్ బస్తీలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి సరస్వతి(4)పై ఒక్కసారిగా వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచ్చింది. బాలిక అరుపులు విన్న స్థానికులు కుక్కను తరిమికొట్టారు. గాయపడ్డ చిన్నారిని తల్లిదండ్రులు గోల్కొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం నిలోఫర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

