
బెంగళురు అల్లర్లతో తెలంగాణలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అల్లర్లకు కారణం అయిన సోషల్ మీడియా పోస్టులపై నిఘా పెంచారు. అన్నీ జిల్లాల పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో… శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టవద్దని.. అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రజలను హెచ్చరించారు పోలీసులు. సోషల్ మీడియాలో అలాంటి విద్వేషకర పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు. అలాంటి పోస్టులు పెట్టిన వారిపై వెంటనే కేసులు పెట్టి, తగిన కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని స్టేషన్లకూ… సీనియర్ అధికారులకూ ఆదేశాలు జారీచేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. తెలంగాణ భద్రత, రక్షణలో విషయంలో అత్యున్నత స్థాయి పాటించేలా పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ణప్తి చేశారు. సమాజంలో అశాంతిని నెలకొల్పి ప్రభావితం చేసే సోషల్ మీడియా పోస్టులను ప్రచారం చేయవద్దని కోరారు.