హైదరాబాద్, వెలుగు: వచ్చే నెలలో జరగనున్న టెట్‌కు సిద్ధమవుతున్న ఇన్-సర్వీస్ టీచర్ల కోసం స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను మంగళవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో టెట్ కన్వీనర్ రమేశ్.. ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్‌తో కలిసి పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతతో పాటు ఉద్యోగ భద్రత దృష్ట్యా టీచర్లు టెట్‌కు సిద్ధమవడం అభినందనీయమన్నారు. ఎస్‌టీయూ నేతలు సదానందం గౌడ్, జుట్టు గజేందర్ మాట్లాడుతూ.. స్పెషల్ టెట్ రాసే టీచర్ల కోసం పేపర్–1, పేపర్–2కు సంబంధించిన ఐదు వేల సెట్ల స్టడీ మెటీరియల్‌ను ముద్రించినట్లు తెలిపారు.
