వేళ్లకు పెద్దన్న బొటనవేలని తెలుసు కదా. అయినా, ఒక్క చిటికెన వేలిని పక్కనబెడితే, అన్నింటికన్నా బొటనవేలే చిన్నగా ఉంటుంది. అది లేకపోతే దేన్నీ పట్టుకోలేం. ఏ పనీ చేయలేం. ఈ ఫొటో చూడండి. బొటనవేలు తేడాగా కనిపించట్లేదూ!! మామూలుగా అయితే, బొటన వేలు రెండించులుంటుంది. కానీ, అతడికి మాత్రం ఐదు అంగుళాలుంటుంది. అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన జాకబ్ పీనా అనే స్టూడెంట్ బొటన వేలు మామూలు వేళ్లకన్నా పొడవుగా ఉంటుంది. అతడో సారి టిక్‌టాక్ వీడియో చేయడంతో మస్తు ఫేమస్ అయిపోయిండు.
అంత పేరు రావడానికి కూడా కారణం అతడి బొటనవేలే. ఎప్పుడైతే ఫస్ట్ టిక్‌టాక్ వీడియో చేశాడో, అప్పటి నుంచి అతడికి ఫాలోవర్లు పెరుగుతున్నారు. ఇప్పుడు అతడిని ఫాలో అవుతున్న వారి సంఖ్య 15 వేలకు పైనే. మనోడికి క్రేజ్ బాగా పెరిగిపోవడంతో ఆ బొటనవేలిపైనే ఎక్కువగా టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నాడు. కొందరు నెటిజన్లు అది థంబ్ కాదని, పెద్ద కత్తని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఆ వేలితో తిండెట్లా తింటావ్ రా బాబు అని కామెంట్ చేస్తున్నారు.

