
హైదరాబాద్ లోని కూకట్ పల్లి JNTU గేటు ముందు పీజీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. JNTU ప్రిన్సిపల్ రూల్స్ అంటూ నియంతగా వ్యవహరిస్తున్నారని పీజీ విద్యార్థులు ఆరోపించారు. ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేస్ ఫీజు కోసం రిజల్ట్ అపడం ఏంటని ప్రశ్నించారు. JNTUలో 144 సెక్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా హాస్టల్ లో ఫుడ్ కూడా సరిగ్గా లేదని మండిపడ్డారు. పురుగుల అన్నం పెడుతున్నారని.. తాము ఎలా ఫుడ్ తినాలని హాస్టల్ నిర్వహకులను నిలదీశారు.