బౌలర్లను ముందుగానే స్టడీ చేస్తా: కోహ్లి

బౌలర్లను ముందుగానే స్టడీ చేస్తా: కోహ్లి

చాక్లెట్లు బాగా తినేవాడిని..

2012 ఫెయిల్యూర్ నాలో చాలా మార్పు తెచ్చింది

న్యూఢిల్లీ: రన్ మెషీన్ , ఫిట్ నెస్ ఫ్రీక్ .. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఈ మాటలు వంద శాతం సరిపోతాయి. ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యమి చ్చే విరాట్ .. ఒకప్పుడు ప్యాకెట్ల ప్యాకెట్ల చాక్లెట్లు తినేసే వాడట. తన ముందు ఎలాం టి ఫుడ్ పెట్టినా లాగించేసేవాడట. అంతేకాక మ్యాచ్ కు ముందే బౌలర్లను పూర్తిగా స్టడీ చేస్తానని, దాని వల్లే ఫీల్డ్ లో డామినేట్ చేస్తున్నానని తెలిపాడు. ‘ఓపెన్ నెట్స్ విత్ మయాంక్’ పేరిట యువ బ్యాట్స్ మన్ మయాంక్ అగర్వాల్ నిర్వహించిన చాట్ షోలో కోహ్లీ పలు అంశాలపై మాట్లాడాడు. ఆ విషయాలు అతని మాటల్లోనే…

2012 ఐపీఎల్ తర్వాత మారిపోయా.. 201 2 ఐపీఎ ల్ లో ఫెయిలవ్వడంతో నాలో చాలా మార్పు వచ్చింది. ఫిట్ నెస్ విషయంలో మిగిలిన వాళ్లతో పోలిస్తే చాలా వెనుకంజలో ఉన్నామని గ్రహించా… దాం తో నన్ను నేను మార్చుకోవాలని డిసైడ్ అయ్యా . అంతకుముందు నా ముందు ఏం పెట్టి నా తినేసేవాడిని. ఎంతలా అంటే అప్పుడు టీమ్ బస చే సిన హోటల్ లో ఓ బాటిల్ లో 40 చాక్లెట్లు పెట్టే వారు. నాలుగైదు రోజుల్లో నేను వాటిని తినేసేవాడిని. సక్సెస్ లో ఉండడంతో ఏం ఆలోచించేవాడిని కాదు. కానీ 2012 ఐపీఎల్ లో ఫెయిల్యూర్ తర్వాత అన్నీ మార్చుకున్న. బౌలర్లను అలా డామినేట్‌ చేస్తుంటా.. రన్ అప్ , రిస్ట్ మూమెంట్ , బాల్ పట్టుకున్న విధానం నుం చి ఓ బౌలర్ గురించి ప్రతీ అంశాన్నిమ్యా చ్ కు ముందే స్టడీ చేస్తా. దానివల్ల ఓ బౌలర్ ఎప్పుడు ఎలాంటి బా ల్ వేస్తాడో ముందే గ్రహిస్తా. అందుకే బౌలర్ ఎవరైనా సరే.. ఔట్ అవుతామనే భయం లేకుండా షాట్లు ఆడగలుగుతా… బౌలర్లను డామినేట్ చేస్తుంటా.

సచిన్ కు మేమిచ్చి గిఫ్ట్ అది

2011వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన తర్వాత సచిన్ ను భుజానికెత్తుకున్న ఫోటో ఎప్పుడు చూసినా సరే గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము వరల్డ్ చాం పియన్స్ . ఆ టైమ్ లో తెలియకుండానే జట్టంతా సచిన్ దగ్గరకే చేరింది. ఎందుకంటే సచిన్ కు అది లా స్ట్ చాన్స్ అని అందరికీ తెలుసు. పాజీ (సచిన్ ) దేశానికి ఎంతో చేశాడు. అలాంటి వ్యక్తికి మేమిచ్చి న బెస్ట్ గిఫ్ట్ ఆ వరల్డ్ కప్ .

అనుష్క దొరకడం అదృష్టం

అనుష్క లైఫ్ పార్టనర్ గా దక్కడం నేను చేసుకున్న అదృష్టం . తను లైఫ్ లోకి వచ్చాక నా ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది.వ్యక్తిగా నా బాధ్యతలేంటో తెలుసుకున్నా. ఓ ప్లేయర్ గా ఇతరులకు ఉదాహరణగా ఉండాలని తెలుసుకున్నా. మనుషులను, పరిస్థితులను అంచనా వేయడం తన దగ్గరే నేర్చుకున్నా. అనుష్క నన్ను ఓ మంచి వ్యక్తిగా మార్చింది.