- లావ్యూ పేరుతో ప్రారంభం
జపాన్జనానికి టెక్నాలజీ అంటే పిచ్చి. ఎప్పటికప్పుడు అప్డేట్అవుతూనే ఉంటారు. రైళ్లంటే ఇంకా ఎక్కువ పిచ్చి. అందుకే కొత్తకొత్త రైళ్లను తయారు చేస్తూనే ఉంటారు. హైస్పీడ్రైళ్లు, మెట్రోలు.. అక్కడ సర్వసాధారణం. ఇప్పుడు కొత్తగా మరో రైలుకు ‘ప్రాణం’ పోసింది జపాన్. ప్రిట్జ్కెర్ ప్రైజ్ విజేత, ఆర్కిటెక్ట్ కజుయో సెజిమా.. సీబు 001 సిరీస్లో ‘లావ్యూ’ పేరుతో ఓ ట్రైన్తయారు చేశారు.
- లావ్యూ స్పెషాలిటీస్ ఇవీ..
సీ బు రైల్వే కమ్యూటర్ రైలు గత మార్చిలో టోక్యోలో ప్రారంభమైంది.సిటీలోని పర్వతాలపై వెళ్తున్నప్పుడుప్రకృతిలో కలిసిపోయేలా సిల్వర్ కలర్పెయింట్ చేశారు. - ఇందులో పెద్ద పెద్ద, కర్వుడ్ విండోస్ఉంటాయి. బయటి వ్యూ పూర్తిగా కనిపించేలా డిజైన్ చేశారు. యెల్లో కలర్ లో ఉన్న చైర్లు హెడ్ రెస్ట్, ఆర్మ్ రెస్ట్ అడ్జెస్ట్చేసుకునేలా ఉంటాయి. వాటిలోకూర్చుం టే ఓ లగ్జరీ లివిం గ్ రూమ్ లో రిలాక్స్ అవుతున్నట్లుగా ఉంటుంది.
- మొత్తం 8 పెట్టెల్లో 422 సీట్లు ఉంటాయి.గంటకు 120 కిలోమీటర్ల స్పీడుతోవెళ్తున్ నా.. ఎలాం టి కుదుపులు ఉండవు.
- లావ్యూలో.. ‘ఎల్’ అంటే లగ్జరీ లివిం గ్,‘ఏ’ అంటే బాణం లాం టి వేగం, ‘వ్యూ’అంటే.. అందులో ప్రయాణించాక కలిగే అందమైన భావన.. అని అర్థం.
- టోక్యోలోని ఇకెబుకురో, సీబు, చిచిబు మధ్య ఈ సర్వీసులు నడుస్తున్ నాయి.
