తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బయట గోగర్భం డ్యామ్ వరకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. దీంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ SSD దర్శనానికి 10 గంటల సమయం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 8 గంటల సమయం పడుతుంది.
మరో వైపు బుధవారం ( మే 20) తిరుమల శ్రీవారిని 86 వేల 315 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 44 వేల 107 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.94 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
