నాన్న నాకు ఎన్నో ఇచ్చారు..మహేశ్ బాబు భావోద్వేగం

నాన్న నాకు ఎన్నో ఇచ్చారు..మహేశ్ బాబు భావోద్వేగం

నా జీవితంలో నాన్న నాకు ఎన్నో ఇచ్చారని.. వాటన్నింటిలోకి మీ అభిమానం చాలా గొప్పదని సూపర్ స్టార్ మహేశ్‌ బాబు అన్నారు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. ఇవాళ జేఆర్సీ ఎన్ కన్వెన్షన్ లో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు కుటుంబ సభ్యులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభిమానులను ఉద్దేశించి మహేశ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 

‘నాన్న ఎల్లప్పుడూ మన గుండెల్లోనే, మన మధ్యే ఉంటారు. మీరందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. కార్యక్రమంలో నమ్రత, మంజుల, సుధీర్‌బాబు తదితరులు కృష్ణ చిత్రపటానికి నివాళి అర్పించారు. పెద్దకర్మకు హాజరైన అభిమానులకు భోజనం ఏర్పాటు చేశారు.