రజినీ దీపావళి శుభాకాంక్షలు: బోరుబావిలోంచి చిన్నారి బయటకు రావాలని ఆకాంక్ష

రజినీ దీపావళి శుభాకాంక్షలు: బోరుబావిలోంచి చిన్నారి బయటకు రావాలని ఆకాంక్ష

అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు సూపర్ స్టార్ రజినీకాంత్. చెన్నైలోని తన నివాసానికి వచ్చిన అభిమానులను ఆయన కలిశారు. వారితో మాట్లాడారు. ఫొటోలు దిగారు. అలాగే.. తమిళనాడులో బోరుబావిలో పడిన బాలుడు సురక్షింతంగా బయటకు రావాలని ఆకాంక్షించారు. ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

తమిళనాడుతోని తిరుచిరాపల్లి .. నాడుకట్టుపల్లి గ్రామంలో శుక్రవారం సుజిత్ విల్సన్ అనే పిలగాడు బోరుబావిలో పడ్డాడు. రెండు రోజులుగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఆ బోరు బావికి సమాంతరంగా గోతిని తవ్వి బయటకు తీసేందుకుప్రయత్నిస్తున్నారు అధికారులు.