‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వర్మకు ఎదురుదెబ్బ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వర్మకు ఎదురుదెబ్బ

అమరావతి;- దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ‘లక్ష్మి ఎన్టీఆర్’ విడుదలకు సంబంధించి సుప్రీంకోర్టు తక్షణ విచారణకు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ అభ్యర్ధనను తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 3 వరకు ‘లక్ష్మీ ఎన్టీఆర్’ను విడుదల చేయరాదని ఆదేశించిన నేపథ్యం వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు . చిత్రం విడుదల కాకపోవడం వెనుక రాజకీయ అజెండా ఉందని ఆరోపించిన వర్మ త్వరగా విచారించి సినిమా విడుదల అయ్యేలా చెయ్యాలని సుప్రీంను కోరాడు . అయితే సుప్రీం కోర్టులో దీనిపై అంత త్వరగా విచారించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.