న్యూఢిల్లీ, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అల్వాల్‌లో ఓ చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితుడికి లీగల్ సాయం అందించాలని సుప్రీం కోర్టు సూచించింది. 2016 లో అల్వాల్‌లో తొమ్మిదేండ్ల చిన్నారిపై అత్యాచార ఆరోపణలతో చింతకింద అనిల్‌పై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటనపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు అనిల్‌ను నిర్ధోషిగా తేల్చింది. ఈ తీర్పును తెలంగాణ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 11న సుప్రీంలో సవాల్ చేసింది.
అనిల్‌పై నమోదైన నేర చరిత్ర వివరాలను స్పెషల్ లీవ్ పిటిషన్లో పొందుపరిచింది. పోక్సో కేసు నుంచి జైలు నుంచి విడుదలైన అనిల్ జంట హత్యలు చేసినట్లు పేర్కొంది. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది.నిందితుడి తరపున ఎవరూ లేకపోవడంతో ఓ న్యాయవాదిని ఆయనకు సమకూర్చాలని లీగల్ సర్వీస్ కమిటీకి కోర్టు సూచించింది.
