CBSE త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వం, NCERT కి దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 9,10 తరగతి విద్యార్థులకు త్రిభాషావిధానం తప్పనిసరి చేస్తూ NCERT ఇచ్చిన సర్క్యూలర్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, NCERT కి నోటీసులిచ్చింది. మరోవైపు 8వతరగతి ఎన్ సీఆర్టీ పుస్తకంలో వివాదాస్పదైన న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఉందన్న కోర్టు.. బాధ్యులైన విద్యాశాఖ కార్యదర్శి, ఎన్ సీఈఆర్టీ చైర్మన్ కు కోర్టు దిక్కరణ నోటీసులు జారీ చేసింది.
చీఫ్ జస్టిస్ సూర్య కాంత్,జడ్రజీలు జాయ్‌మల్య బాగ్చీ, విపుల్ ఎమ్ పంచోలిలతో కూడిన ధర్మాసనం.. రెండు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని సీబీఎస్‌ఈ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్‌ఈ తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఎన్‌సీఈఆర్‌టీ 9, 10 తరగతుల సిలబస్‌ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.
