బడుల్లో వసతులపై సీఎస్​కు సుప్రీం నోటీసులు

బడుల్లో వసతులపై సీఎస్​కు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో వసతుల కొరత, ప్రైవేటు బడుల్లో ఫీజుల మోత తదితర అంశాలపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. విద్యాప్రమాణాలపై గతంలో సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్రంలో అమలుకావడంలేదని, దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్​ను జస్టిస్​ అరుణ్​ మిశ్రా, జస్టిస్​ రవీంద్ర భట్‌ల బెంచ్​ విచారించింది. సర్కారు బడుల్లో టీచర్ల భర్తీ, పర్యవేక్షణ, వసతులు సరిగా లేకపోవడంతో విద్యాప్రమాణాలు తగ్గిపోతున్నాయని, ఇప్పటికీ 90 శాతం మండలాల్లో ఎడ్యుకేషన్​ ఆఫీసర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పిటిషన్​ తరఫు అడ్వొకేట్​ శ్రవణ్ కుమార్​.. కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 60 శాతం ప్రైవేటు బడులు ఇష్టమొచ్చినట్లు ఫీజులు వసూళ్లు చేస్తున్నాయని, ఫీజుల నియంత్రణలో సర్కారు విఫలమైందని తెలిపారు. పిటిషనర్​ వాదనలపై స్పందించిన బెంచ్​.. మూడు వారాల్లోగా పూర్తి వివరాలతో  కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్​ను ఆదేశించింది.

Supreme Court notice to CS on shortage of accommodation in government schools,  private schools fees