
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్కు శుక్రవారం (జూన్ 6) సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన 25వేల కోట్ల అవినీతి ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం 25వేల కోట్లు అవినీతికి పాల్పడిందని కేటీఆర్ గతంలో ఆరోపణలు చేశారు. కేటీఆర్ ఆరోపణలపై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఆత్రం సుగుణ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుని హైకోర్టుపై సవాల్ చేశారు కేటీఆర్.. హైకోర్టు కేటీఆర్ కు అనుకూలంగా తీర్పుచెప్పింది.
అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆత్రం సుగుణ సుప్రీంకోర్టుకు వెళ్లారు. శుక్రవారం ఆత్రం సుగుణ పిటిషన్ పై జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ పై సమాధానం చెప్పాలని కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.