స్పైస్‌‌‌‌‌‌‌‌ జెట్‌‌‌‌‌‌‌‌కు సుప్రీం కోర్టులో ఊరట

స్పైస్‌‌‌‌‌‌‌‌ జెట్‌‌‌‌‌‌‌‌కు సుప్రీం కోర్టులో ఊరట

న్యూఢిల్లీ:   కాల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కళానిధి మారన్ స్పైస్‌‌‌‌‌‌‌‌జెట్ నుంచి రూ.1,323 కోట్ల నష్టపరిహారం కోరుతూ దాఖలు చేసిన అప్పీల్‌‌‌‌‌‌‌‌ను సుప్రీం కోర్టు బుధవారం తోసిపుచ్చింది.  గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును  సమర్థించింది. 

జస్టిస్ పీఎస్‌‌‌‌‌‌‌‌ నరసింహ, ఏఎస్‌‌‌‌‌‌‌‌ చందూర్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన  బెంచ్ మారన్, కాల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌లను కొట్టేసింది. ఈ వివాదం 2015 నాటిది.  స్పైస్‌‌‌‌‌‌‌‌ జెట్ షేర్లు బుధవారం 6 శాతం లాభపడి రూ.40 వద్ద ముగిశాయి.