సుప్రీం తీర్పుతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ లుగా కోదండరాం, అజార్ లకు లైన్ క్లియర్ : కాంగ్రెస్ వర్గాలు

సుప్రీం తీర్పుతో  గవర్నర్ కోటా ఎమ్మెల్సీ లుగా కోదండరాం, అజార్ లకు లైన్ క్లియర్ : కాంగ్రెస్ వర్గాలు

హైదరాబాద్, వెలుగు: సుప్రీం కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తెలంగాణ జన సమితి ( టీజేఎస్ ) అధ్యక్షుడు కోదండరాం, మంత్రి అజారుద్దీన్ ల ఎన్నికకు లైన్ క్లియర్ అయినట్లేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసే పేర్లపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు గవర్నర్ కు ఉందని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో.. రాష్ట్ర మంత్రివర్గం తాజాగా కోదండరాం, అజారుద్దీన్ ల పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

దీంతో ఈ ఇద్దరు తిరిగి ఎమ్మెల్సీలుగా నియామకం అయ్యే అవకాశం ఉందంటున్నారు. అక్టోబర్ 31 న జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఇప్పటికే అజార్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మూడు నెలలు గడిచింది. మరో మూడు నెలల్లో ఆయన ఏదో ఒక చట్ట సభలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు అజార్ తో పాటు కాంగ్రెస్ కు ఎంతో ఊరటనిచ్చిందనే చెప్పొచ్చు.