ఇంధన పొదుపు బాటలో సుప్రీంకోర్టు.. వర్చువల్ విచారణ, జడ్జిల కార్ పూలింగ్

ఇంధన పొదుపు బాటలో సుప్రీంకోర్టు.. వర్చువల్ విచారణ, జడ్జిల కార్ పూలింగ్

న్యూఢిల్లీ: ఇంధన పొదుపును ప్రోత్సహిస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మిస్​లేనియస్ రోజుల్లో, హాఫ్​డేస్​లో లిస్ట్ అయ్యే అన్ని కేసుల విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పరిపాలనా విభాగం శుక్రవారం ఓ సర్క్యులర్ జారీ చేసింది. 

దీని ప్రకారం.. సోమ, శుక్రవారాలు, ఇతర నిర్దేశిత మిస్​లేనియస్ రోజుల్లో లిస్ట్ అయ్యే అన్ని కేసులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వర్చువల్ విధానంలోనే విచారిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కార్ పూలింగ్​ విధానానికి అంగీకరించారు.