న్యూజిలాండ్ తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కు ఓపెనర్ కేఎల్ రాహుల్ దూరం అయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా రాహుల్ టెస్టు సిరీస్ కు అందుబాటులో ఉండడని బీసీసీఐ ట్వీట్ చేసింది. అలాగే సూర్యకుమార్ యాదవ్ కు టెస్టు జట్టులో స్థానం దక్కింది. 25 నుంచి జరగనున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. విరాట్ కొహ్లీకి రెస్ట్ ఇవ్వడంతో తొలి టెస్టుకు కెప్టెన్ గా రహానే ..వైస్ కెప్టెన్ గా పూజారా బాధ్యతలు తీసుకోనున్నాడు. రెండో టెస్టుకు కొహ్లీ, రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నారు.అజింక్యా రహానే (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా(వైస్ కెప్టెన్), శుభమాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ సిరాజ్ యాదవ్ లు ఉన్నారు.
NEWS - Suryakumar Yadav replaces KL Rahul in India's Test squad.
— BCCI (@BCCI) November 23, 2021
KL Rahul has sustained a muscle strain on his left thigh and has been ruled out of the upcoming 2-match Paytm Test series against New Zealand.
More details here -https://t.co/ChXVhBSb6H #INDvNZ @Paytm pic.twitter.com/uZp21Ybajx
India’s Test squad: Ajinkya Rahane (c), Mayank Agarwal, Cheteshwar Pujara, Shubman Gill, Shreyas Iyer, Suryakumar Yadav, Wriddhiman Saha, KS Bharat, Ravindra Jadeja, R Ashwin, Axar Patel, Jayant Yadav, Ishant Sharma, Umesh Yadav, Md Siraj, Prasidh Krishna, as per BCCI
— ANI (@ANI) November 23, 2021

