Surya Kumar Yadav: ‘హలో ఫ్రెండ్’ అంటూ సూర్య ఇంట్రెస్టింగ్ పోస్ట్

Surya Kumar Yadav: ‘హలో ఫ్రెండ్’ అంటూ సూర్య ఇంట్రెస్టింగ్ పోస్ట్

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదరగొడుతున్న టీమిండియా  స్టార్  బ్యాట్స్మెన్  సూర్యకుమార్ యాదవ్  టెస్టుల్లో అరంగేట్రం దాదాపుగా కన్ఫామ్ అయినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 9నుంచి భారత్, ఆస్ట్రేలియా  మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ  మొదలుకానుంది.  ఈ  టెస్టు సిరీస్ కు సూర్యను కూడా బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే టెస్టుల్లో తన ఎంట్రీపై ఇన్స్టాగ్రామ్ లో సూర్య చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. ‘హలో ఫ్రెండ్’ అంటూ రెడ్ బాల్ ఫొటోను సూర్య షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో సూర్య  ఎంట్రీ కన్ఫామ్ అయిందని అభిమానులు భావిస్తున్నారు.

రోడ్డు ప్రమాదం కారణంగా పంత్.., గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ లకు టెస్టు సిరీస్ కు దూరం కావడంతో  సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతేడాది ముంబై తరపున రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సూర్య..  హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 80 బంతుల్లో 90 పరుగులు చేశాడు. ఆ తర్వాత సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 107 బంతుల్లో 95 పరుగులు సాధించాడు.