ఇదేం నీతి: OICలో సుష్మాకు గౌరవ అతిథ్యం.. భేటీకి పాక్ దూరం

ఇదేం నీతి: OICలో సుష్మాకు గౌరవ అతిథ్యం.. భేటీకి పాక్ దూరం

Sushma Swaraj is coming, will not attend OIC meet: Pakistan ministerఇస్లామాబాద్: పైకి శాంతి శాంతి అని కబుర్లు చెబుతూనే పాకిస్థాన్ తన అసలు రంగును మరోసారి బయటపెట్టుకుంది. భారత్ తో శాంతిని కోరుకుంటున్నామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, విదేశాంగ మంత్రి ఖురేషీ ప్రకటనలు చేశారు. కానీ నేడు దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. అబుధాబి లో జరుగుతున్న OIC భేటీకి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గౌరవ అతిథిగా వచ్చారు. కానీ ఆమె వచ్చినందున తాను ఈ సమావేశానికి వెళ్లడం లేదని పాక్ మంత్రి ఖురేషీ చెప్పారు.

తొలిసారే.. గౌరవ అతిథిగా..

ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ (OIC) సమావేశానికి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను గౌరవ అతిథిగా ఆహ్వానించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. వారి సంక్షేమం, హక్కులు కాపాడడంతో పాటు అంతర్జాతీయ శాంతికి చేయాల్సిన కృషిపై చర్చించేందుకు భారత్ ను తొలిసారి OIC భటీకి ఆహ్వానించారు. తొలి సమావేశంలోనే గౌరవ అతిథిగా సుష్మాకు ఆహ్వానం అందడం విశేషం.

పాక్ అక్కసు…

OICలో సభ్యత్వం కూడా లేని భారత్ కు తొలి ఆహ్వానంలోనే ప్రత్యేక గౌవరం దక్కడంపై పాక్ అక్కసు వెళ్లగక్కుతోంది. సుష్మా స్వరాజ్ ను గౌరవ అతిథిగా పిలవడంపై పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ అసహనం వ్యక్తం చేశారు. సభ్యత్వం కూడా లేని దేశాన్ని ఎలా ఆహ్వానిస్తారని, ఆమెకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకోవాలని యూఏఈని కోరానని ఆయన చెప్పారు. అందుకు యూఏఈ అంగీకరించలేదు. దీంతో తానే ఆ భేటీకి రావడం లేదని ప్రకటించారు.  ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నందునే ఆమెతో వేదిక పంచుకోవడానికి ఇష్టపడడం లేదని చెప్పారు.

శాంతి కోరేది ఇలాగేనా…

భారత్ తో శాంతి కోరుతున్నామని చెబుతూనే సుష్మా రావడం వల్లే తాను OIC భేటీకి రావడం లేదని ఖురేషీ ప్రకటించడాన్ని దౌత్య నిపుణులు తప్పుబడుతున్నారు.  ఆమె వస్తున్నారన్న కారణంతో భేటీకి రాకపోవడాన్ని ఏ రకమైనా శాంతి చర్చలకు సంకేతమని ప్రశ్నిస్తున్నారు. పాక్ డబుల్ స్టాండ్ ఇక్కడే బయటపడిందని చెబుతున్నారు.