ఇద్దరు పసి పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

ఇద్దరు పసి పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

మదర్స్ డే రోజున హైదరాబాద్ లోని మీర్ పేటలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు పిల్లలను నీళ్ల టబ్ లో ముంచేసింది. ఈ ఘటన తీవ్రంగా కలిచివేస్తోంది.

మీర్ పేట జిల్లేల గూడెలోని లలిత నగర్లో మాడ్గుల మండలానికి చెందిన శ్రీనివాస్  , భారతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు విక్కీ, లక్కీ ఉన్నారు. మే 13నసాయంత్రం  దంపతుల మధ్య గొడవ జరిగింది. ఇవాళ(ఆదివారం) కూడా మరోసారి గొడవ జరగడంతో భర్త శ్రీనివాస్ బయటకు వెళ్లాడు. ఈ సమయంలో  ఇద్దరు పసిపిల్లలను  టబ్ లో నీళ్లు నింపి పిల్లలను అందులో పడేసింది. అనంతరం  ఆమె విషం తాగింది. ఈ విషయాన్ని  ఆమె స్వయంగా  తన  భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే ఆమె  భర్త శ్రీనివాస్ పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.   భారతిని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు చిన్నారుల మృతదేహాలను రికవరీ చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.