శ్రీశైలంలో మళ్లీ  ప్రారంభమైన స్వామివారి దర్శనాలు

శ్రీశైలంలో మళ్లీ  ప్రారంభమైన స్వామివారి దర్శనాలు

శ్రీశైలం మల్లిఖార్జున స్వామి వారి దర్శనాలు మళ్లీ తిరిగి ప్రారంభమయ్యాయి. నిన్న(శుక్రవారం) ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 5.30 గంటల నుండి7.30 గంటల వరకు భక్తులను స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతించినట్లు తెలిపారు ఈవో కె.ఎస్.రామారావు. 10 సంవత్సరాల నుండి 65 ఏళ్ల వయసు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతించారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్‌లైన్‌లో తమ పేరును నమోదు చేసుకున్నారు. భక్తులు తమ వెంట ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని ముందుగానే తెలిపారు ఆలయాధికారులు.

గత నెల ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో.. జులై 15 నుంచి ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. ముందుగా వారం రోజులే ఆలయంలో దర్శనాలను ఉండవని ప్రకటించినప్పటికీ.. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా దర్శనాల నిలుపుదలను పొడిగిస్తూ వచ్చారు. ఆలయంలో యథావిధిగా స్వామివారి నిత్య కైంకర్యాలు, పరోక్ష సేవలను కొనసాగించారు.