వారికి మాత్రమే పర్మినెంట్ వర్క్ ఫ్రం హోం

వారికి మాత్రమే పర్మినెంట్ వర్క్ ఫ్రం హోం

ప్రముఖ ఫుడ్ డెలివరీలలో ఒకటైన స్విగ్గీ ఉద్యోగస్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పాలసీని ప్రకటించింది. శుక్రవారం ఈ మేరకు స్టేట్ మెంట్ ఇచ్చింది. ఎక్కడి నుంచైనా పని చేసుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్, టెక్నాలజీ టీమ్ లకు వర్క్ ఫ్రం హోం ఇచ్చేశారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రొడక్టివిటీ బాగా పెరిగిందని కంపెనీ వెల్లడించింది. బేస్ లొకేషన్ లలో పని చేసే వారు వారంలో కొన్ని రోజులు ఆఫీసుకు రావాలని పేర్కొంది.

ప్రతి త్రైమాసానికి ఒకసారి సమావేశమవుతారని తెలిపింది. పర్మినెంట్ వర్క్ ఫ్రం హోం విషయంలో పలువురు మేనేజర్లు, ఉద్యోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు స్విగ్గీ వెల్లడించింది. ఉద్యోగులు తమ పనిని చాలా సౌలభ్యంగా చేసుకోవడంపై తాము దృష్టి సారించడం జరిగిందని స్విగ్గీ హెచ్ఆర్ హెడ్ గిరీష్ మీనన్ తెలిపారు. 2014 సంవత్సరంలో స్విగ్గీ ఎంటర్ ఇచ్చింది. దేశీయ మార్కెట్ లోకి ప్రవేశించిన స్విగ్గీ సంస్థ 27 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 487 నగరాల్లో ఉద్యోగులు చాలా వరకు వర్క్ ఫ్రం హోం ద్వారా పని చేస్తున్నారు.