మద్యం, డ్రగ్స్ను నియంత్రించాలె.. కాంగ్రెస్ ఆందోళన

మద్యం, డ్రగ్స్ను నియంత్రించాలె.. కాంగ్రెస్ ఆందోళన

హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయం ముందు టీపీసీసీ నిరసన చేపట్టింది. రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా వినియోగంతో నేరాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం, డ్రగ్స్ వల్లనే మహిళలు, బాలికలపైన దాడులు, హత్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

డ్రగ్స్, మద్యం పెరిగిపోవడంతో సమాజంలో తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు. తెలంగాణలో మద్యం ఆదాయం విపరీతంగా పెరిగిపోయిందని.. శాంతి భద్రతలు కూడా పూర్తిగా క్షిణిస్తున్నాయని తెలిపారు. డ్రగ్స్, మద్యం, గంజాయితో యువకులు పక్కదారి పడుతున్నారని.. తక్షణమే వీటిని నియంత్రించాలని కోరారు. అనంతరం వారు ఆబ్కారీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.