
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గం.. గం.. గణేశా’. తన కెరీర్‌లో ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రగతి శ్రీవా స్తవ, కరిష్మా హీరోయిన్స్. ఈ సినిమాకు సంబంధించి ఆదివారం ఓ అప్‌డేట్ ఇచ్చాడు హీరో ఆనంద్. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నట్టు ట్వీట్ చేశాడు. ‘ఈ క్రైమ్ కామెడీ డ్రామా కోసం కొన్నేళ్లుగా పనిచేస్తున్నాం.
మేకింగ్ విషయంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాం. కానీ అంతా సవ్యంగా ముగుస్తోంది. సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. వినూత్న రీతిలో ఈ కామెడీ డ్రామాను హ్యాండిల్ చేశాం’ అని చెప్పాడు. వెన్నెల కిశోర్, జబర్దస్త్ ఇమ్మానుయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు.