T20 World Cup: సూపర్–8 గ్రూప్ 2 సమీకరణలు.. సెమీఫైనల్‌కు చేరేది ఏ జట్టు అంటే?

T20 World Cup: సూపర్–8 గ్రూప్ 2 సమీకరణలు.. సెమీఫైనల్‌కు చేరేది ఏ జట్టు అంటే?

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో  భాగంగా జరగనున్న సూపర్–8 దశకి ముందు గ్రూప్– 2 టోర్నమెంట్‌లోనే అత్యంత ఉత్కంఠభరితమైన గ్రూప్‌గా నిలవనుంది. ఈ గ్రూప్‌లో పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. సెమీఫైనల్ బెర్త్ కోసం ఈ నాలుగు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. 

పాకిస్థాన్: ప్రమాదకర జట్టు
పాకిస్థాన్ జట్టు సూపర్–8లోకి అడుగుపెడుతోంది. పాక్ పేస్ దళం వారికి అతి పెద్ద బలం. ఏ బ్యాటింగ్ లైనప్‌నైనా ఈజీగా కూల్చివేయగల సామర్థ్యం ఈ బౌలర్లకు ఉంది. టాప్ ఆర్డర్ బ్యాటర్ల నిలకడతో పాటు మిడిల్ ఆర్డర్ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కుంటే, పాకిస్థాన్ బలమైన టీంగా సెమీఫైనల్ రేసులో నిలుస్తుంది.  

శ్రీలంక: యువ ఉత్సాహం
యువతతో పాటు అనుభవం కలగలిపిన సమతుల్యం కలిసిన జట్టుతో శ్రీలంక ఆకట్టుకుంటోంది. వారి స్పిన్ విభాగం దూకుడైన బ్యాటింగ్ ఇతర జట్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. పరిస్థితులకు అనుకూలంగా బ్యాటర్లు ఆడుతున్నా, పేస్‌పై ఆధారపడే బలమైన జట్లతో ఆడే మ్యాచ్‌ల్లో లంక బ్యాటర్లకు నిలకడ చాలా ముఖ్యం.

ఇంగ్లండ్: దూకుడైన బ్యాటింగ్
వైట్‌బాల్ క్రికెట్‌లో ఇంగ్లండ్‌కు ఉన్న పేరు ఈ గ్రూప్‌లో వారిని హాట్ ఫేవరెట్‌గా నిలబెడుతోంది. దూకుడైన బ్యాటింగ్, లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ లైనప్‌తో పాటు తక్కువ సమయంలోనే మ్యాచ్‌ను తమవైపు తిప్పగల సామర్థ్యం ఉంది. పేస్, స్పిన్ రెండింట్లోనూ సమతుల్యం ఉండటంతో కీలక సూపర్–8 మ్యాచ్‌ల్లో వారికి అద్బుతమైన అవకాశంగా మారే ఛాన్స్ ఉంది. 

న్యూజిలాండ్: అత్యంత నిలకడగా ఆడే జట్టు
ఐసీసీ టోర్నమెంట్లలో అత్యంత నిలకడగా ఆడే జట్టుగా పేరుగాంచిన న్యూజిలాండ్, మరోసారి ప్రశాంతతతో కూడిన వ్యూహాంతో బరిలోకి దిగుతోంది. కట్టుదిట్టమైన బౌలింగ్, అద్భుతమైన బ్యాటింగ్ వారి ప్రధాన బలం. ఒత్తిడిలోనూ నార్మల్ గా ఉండగల సామర్థ్యం కలిగిన కివీస్ ను నాకౌట్ దశల్లో అత్యంత ప్రమాదకర జట్టుగా మారుస్తుంది.

గ్రూప్ 2లో మొదటి స్థానాల్లో నిలిచే జట్లు ఇవే అని చెప్పడానికి ఏం టీమ్ కనిపించడం లేదు.. ఎందుకంటే, ప్రతి జట్టు తమ బెస్ట్ ఇవ్వాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నాయి. ఈ సూపర్–8లో పాయింట్లు సమంగా ఉంటే నెట్ రన్‌రేట్ కీలకంగా మారే అవకాశం ఉంది. నాలుగు జట్లలోనూ ప్రతిభకు కొదవ లేకపోవడంతో, అభిమానులకు క్లోజ్ ఫినిష్‌లు, మాస్టర్‌క్లాస్‌లు మ్యాచ్ లు, అనూహ్య ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కవుగా ఉన్నాయి.