‘తబ్లిగీ జమాత్ వల్లే కరోనా కేసుల పెరుగుదల’

‘తబ్లిగీ జమాత్ వల్లే కరోనా కేసుల పెరుగుదల’

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి పెరగడానికి తబ్లిగీ జమాత్ కారణమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ విమర్శించారు. తబ్లిగీ జమాత్ తో సంబంధం ఉన్న వ్యక్తులు కరోనా వ్యాప్తికి ‘ క్యారియర్స్’గా పని చేశారని ఆరోపించారు. ‘తబ్లిగీ వల్ల జరిగిన దాన్ని ఖండించాల్సిందే. వాళ్లు అలా ప్రవర్తించి ఉండకపోతే.. దేశంలో ఫస్ట్ ఫేస్ లాక్ డౌన్ లోనే కరోనా వైరస్ అదుపులోకి వచ్చేది. వ్యాధి రావడం తప్పు కాదు. కానీ రోగాన్ని దాచిపెట్టడం మాత్రం కచ్చితంగా నేరం. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై మేం తప్పక చర్యలు తీసుకుంటాం’ అని ఆదిత్యనాథ్ చెప్పారు.

యూపీలో 19 ‘రెడ్ జోన్’ జిల్లాలు
తబ్లిగీ జమాత్ నేరం చేసిందని దానిపై విచారణ జరగాలని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంతో యూపీలో 3 వేల మంది ప్రజలకు లింక్స్ ఉన్నట్లు తేలిందన్నారు. యూపీలో కరోనా కేసులు సంఖ్య 2,328కి చేరింది. కేంద్రం విడుదల చేసిన రెడ్ జోన్ లో యూపీలోనే ఎక్కువ జిల్లాలు ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా యూపీలో 19 రెడ్ జోన్ జిల్లాలు ఉన్నట్లు తేలింది. ఆ రాష్ట్రంలో అత్యంత కరోనా ప్రభావిత జిల్లాలుగా ఆగ్రా, లక్నో, గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్, మొరాదాబాద్ నిలిచాయి.