నిర్లక్ష్యం చేయొద్దు.. తల్లిదండ్రులు శ్రద్ద చూపాలి

నిర్లక్ష్యం చేయొద్దు.. తల్లిదండ్రులు శ్రద్ద చూపాలి

పోలియో రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలన్నారు మంత్రి తలసాని.దీని కోసం తల్లిదండ్రులు అందరూ శ్రద్ద చూపాలన్నారు. బంజారాహిల్స్ NBT బస్తీ దవాఖానలో చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి. ఆయనతో పాటు  ఎమ్మెల్యే దానం నాగేందర్ , స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని ..పోలియో చుక్కలు ఎవరూ నిర్లక్ష్యం చేయద్దన్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు. రేపటి నుండి ఇంటింటికి పోలియో కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. కరోనా వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గలేదని…అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా వాక్సిన్  హైదరాబాద్ నుండి రావడం మనకు గర్వకారణమన్నరారు. వైద్య సిబ్బంది సేవలు అద్భుతమన్నారు.

ఎర్రకోటపై జెండాకు అవమానం జరగడం బాధాకరం