మే 15న సీపీగెట్ నోటిఫికేషన్

మే 15న సీపీగెట్ నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ( సీపీగెట్) నోటిఫికేషన్ నేడు రిలీజ్ కానున్నది. బుధవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో పలు వర్సిటీల వీసీలతో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సమావేశం నిర్వహించనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కాగా, స్టేట్ లోని 8 వర్సిటీల్లో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ తదితర కోర్సుల్లో అడ్మిషన్లకు కామన్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.