జూపార్క్​లో పులి మృతి

జూపార్క్​లో పులి మృతి
  •     ఏడాదిగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అభిమన్యు


హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్​ పార్క్​లో అభిమన్యు(9) అనే మగపులి మంగళవారం మృతి చెందింది.  బెంగాల్​టైగర్ అభిమన్యు.. ఏడాదిగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ కన్నుమూసింది. 2015 జనవరిలో ఆ పులి జన్మించింది. కొంతకాలంగా వైద్యం అందిస్తున్నప్పటికీ ఈ నెల 5వ తేదీ నుంచి నడవడానికి కూడా వీలులేని స్థితికి చేరుకుంది. మూడు రోజుల నుంచి సమస్య తీవ్రం కావడంతో క్రిటికల్​ స్థితికి చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో అభిమన్యు మృతి చెందింది.