బీజేపీవి సెంటిమెంట్ ​పాలిటిక్స్

బీజేపీవి సెంటిమెంట్ ​పాలిటిక్స్
  •      అయినా ఇండియా కూటమివైపే ప్రజలు 
  •     డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

కాటారం, వెలుగు: బీజేపీ సున్నితమైన​అంశాలను రెచ్చగొట్టి సెంటిమెంట్​పాలిటిక్స్​ చేయాలని చూస్తున్నదని, అది గమనించే జనం ఇండియా కూటమివైపు నిలబడ్డారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మంత్రి శ్రీధర్​బాబు స్వగ్రామం భూపాలపల్లి జిల్లా ధన్వాడ లో దత్తాత్రేయ స్వామి ఆలయ మూడో వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్​కు పది నుంచి 14 ఎంపీ సీట్లు అచ్చే అవకాశం ఉందన్నారు. దేశ సంపదను కాపాడేది కాంగ్రెస్​మాత్రమేనని ప్రజలు నమ్మి ఓటేశారన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్​వరకు రాహుల్​ గాంధీ చేపట్టిన జోడో యాత్ర, మణిపూర్​నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టిన బస్సు యాత్ర సక్సెస్​ అయ్యాయన్నారు. ప్రజలు కచ్చితమైన మార్పు కోరుకున్నారని అభిప్రాయపడ్డారు.

తనకు ఇన్నేండ్లుగా అండగా ఉంటున్న మంథని నియోజకవర్గ ప్రజలు సుభీక్షంగా ఉండాలని ధన్వాడలోని శ్రీధత్తాత్రేయ స్వామి వారిని వేడుకున్నట్లు  ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం  వార్షికోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విప్​ అడ్డూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, ప్రేమ్​సాగర్​రావు, మక్కాన్​సింగ్​ఠాకూర్​ పాల్గొన్నారు.