పంజాగుట్ట, వెలుగు: నిమ్స్ ఆసుపత్రిలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నిమ్స్ డైరెక్టర్ బీరప్ప హాజరై సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులఅర్పించారు.
సేవలాల్ మహారాజ్ బోధనలు ఆదర్శప్రాయమని కొనియాడారు. బంజారా సంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించిన ఈ వేడుకల్లో ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతివీర్, ఇతర వైద్యులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
